ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వరుస జలసంబరాలు జరగనున్నాయి.
డిసెంబర్ 26న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తొలివిడత కేంద్ర సాయం రూ.1,981 కోట్లు రాష్ట్రానికి అందనుంది. అది మొదలు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరుగనున్నాయి. డిసెంబర్ 29న గోదావరి ఎడమ వైపున పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పిఠాపురం వద్ద ఇందుకు సంబంధించిన సభ జరుగుతుంది. ఆ మర్నాడే పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీటు పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రులు హాజరవుతారు. ఇక జనవరి 2న రాయలసీమ పట్టిసీమగా భావిస్తోన్న ముచ్చుమర్తి ఎత్తిపోతల పథకాన్ని సీఎం జాతికి అంకితం చేయనున్నారు. దీనివల్ల రాయలసీమకు 365 రోజులు తాగునీళ్ళు అందుతాయి.
జలాలను సమర్థంగా తగినంతగా వినియోగించుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖకు సెంట్రల్ బోర్డు ఆప్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ)-2017 అవార్డు దక్కింది. కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి చేతులు మీదుగా డిసెంబర్ 29న ఈ అవార్డును దిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ అవార్డును బహూకరించనున్నారు.
No comments:
Post a Comment