Thursday, 1 December 2016

AP Govt Help for Poor and small Business

పేదలు, చిరువ్యాపారులకు చంద్రబాబు చేయూత పదివేలు ఋణం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం 
రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దు నిర్ణయం వల్ల పేదలు, చిరు వ్యాపారులు పెట్టుబడిగా వినియోగించుకోవడానికి రూ.10వేలు ముందస్తు రుణం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. తెల్ల కార్డున్న ప్రతి కుటుంబానికి ఈ రుణం మంజూరు చేస్తారు. దీని కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలను జారీ చేసింది.

తెల్లరేషన్‌ కార్డు కలిగి, దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, పెట్టుబడికి డబ్బు అవసరమైన ప్రతి కుటుంబమూ ఈ రుణం పొందడానికి అర్హమైందే. ఇది ఏక కాల రుణం. కుటుంబ పెద్ద లేదా ఒకరు ఈ రుణం తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని లబ్ధిదారులు ఆరు నెలల్లోపు ఐదు సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణం తీసుకోవడానికి లబ్ధిదారుడు సొంతంగా రాతపూర్వక హామీ ఇస్తే చాలు. ఎలాంటి అనుషంగిక, మూడో వ్యక్తి హామీ అక్కర్లేదు. ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఉంటుంది.
లబ్ధిదారులు వీఆర్వోకు దరఖాస్తు చేసుకుంటే వాటిని తహసీల్దార్‌ పరిశీలించి కలెక్టర్‌కు పంపితే ఆయన మంజూరు చేస్తారు. నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు.

No comments:

Post a Comment