120 కోట్లతో తిరుమలలో అధునాతన వసతులు
తిరుమల క్షేత్రంలో సాధారణ భక్తుల కోసం రూ.120 కోట్ల వ్యయంతో అధునాతన వసతులు ఏర్పాటుచేస్తున్నట్లు టీటీడీ చైర్మన చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో రూ.70 లక్షలతో నిర్మించిన టీటీడీ కల్యాణమండపాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారికి సామాన్య భక్తుల నుంచే కనకవర్షం కురుస్తుందన్నారు. దీంతో వారి కోసమే పెద్దఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. తిరుమల కొండపై తొలి ప్రాధాన్యం సామాన్యులకేనన్నారు. ప్రజలవద్దకే శ్రీవారిసేవలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతటా శ్రీనివాస కల్యా ణం, వేంకటేశ్వర వైభోగం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళితవాడల్లో ఉచితంగా భజన మందిరాలు నిర్మిస్తామన్నారు. గతంలో రూ.2లక్షలు కట్టాల్సి వచ్చేదని, ప్రస్తుతం పూర్తిగా టీటీడీనే భరించి భవనాలను నిర్మిస్తుందన్నారు. క్షేత్రం పరిధిలో లక్షలాది ఎర్రచందనం వృక్షాలు ఉన్నట్లు స్మగ్లర్లు వాటి జోలికి మాత్రం రావడం లేదన్నారు.
No comments:
Post a Comment