జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు తిరుపతిలో జరిగే 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్రప్రభుత్వం. ఇందుకుగాను తక్షణం రూ.5కోట్లను కేటాయించింది. నిర్వహణ, ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ, పి.మాణిక్యాలరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలతో ప్రత్యేకంగా కమిటీని వేశారు.
సదస్సు నిర్వహణ చిహ్నంగా తిరుపతిలోని వంద ఎకరాల్లో సైన్స్ మ్యూజియాన్ని ‘బ్రహ్మాండ’ పేరుతో ఏర్పాటుచేస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా దీని నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. హాంకాంగ్‌లోని సైన్స్ మ్యూజియం స్ఫూర్తిగా దేశంలోనే అతి పెద్ద సైన్స్ మ్యూజియంగా ఇది రూపుదిద్దుకోనుంది. ఆధునిక సాంకేతిక విధానాలతో ఇక్కడి నుంచి తిరుమల శ్రీవారి ఆలయాన్ని వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ సదస్సులో 16వేల మంది పాల్గొనబోతున్నారు. డిసెంబరు రెండో వారానికల్లా పనులన్నీ పూర్తిచేయాలని విజయవాడలో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారుల్ని ఆదేశించారు. సదస్సులో పాల్గొనే అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, బంగ్లాదేశ్‌కు చెందిన 9 మంది నోబెల్ పురస్కార గ్రహీతలకు కేంద్రమంత్రుల తరహాలోనే ప్రొటోకాల్‌ను పాటించనున్నారు. సదస్సు నేపథ్యంగా విద్యాసంస్థల్లో శాస్త్రీయ అంశాలపై పోటీల్ని నిర్వహించాలని, విజేతలకు నోబెల్ గ్రహీతల్ని కలుసుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు.
సైన్స్ కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఉమెన్ సైన్స్ కాంగ్రెస్‌కు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ను ఆహ్వానించబోతున్నారు. చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌కు ప్రత్యేక ఆకర్షణగా వ్యోమగామి సునీత విలియమ్స్ హాజరయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

No comments:
Post a Comment