బర్డ్, స్విమ్స్‌లో ప్రారంభోత్సవాలు
ఇస్కాపై అత్యున్నతస్థాయి సమీక్ష
ఈనాడు-తిరుపతి
* పర్యటన తేదీ: ఈ నెల 16 శుక్రవారం
* సమయం: ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 6.45గంటల వరకు
* తొలి కార్యక్రమం: రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా బర్డ్ ఆసుపత్రికి విచ్చేస్తారు. అక్కడ 11.15గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు ఉంటారు. ఇక్కడ రోగుల కోసం రూ.42.3కోట్లతో నూతనంగా అత్యాధునిక పరికరాలు.. సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఓపీడీ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రోగులతో మాట్లాడతారు. తుదిగా బర్డ్ ఆసుపత్రిని సందర్శిస్తారు.
* రెండో కార్యక్రమం: శ్రీ వేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ(స్విమ్స్). మధ్యాహ్నం 12.45గంటల నుంచి 1.45 గంటల వరకు. శ్రీ పద్మావతీ మహిళా వైద్యకళాశాల నూతన భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం నూతన ఆసుపత్రిని పరిశీలిస్తారు. ఆపై సమయాన్ని బట్టి వైద్యాధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.55నుంచి మూడుగంటల వరకు: తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుంటారు.
* మూడో కార్యక్రమం: మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీపద్మావతీ అతిథిగృహంలోని సమావేశ మందిరంలో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పనుల పురోగతిపై అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు.
* నాలుగో కార్యక్రమం: సాయంత్రం అయిదుగంటల నుంచి ఆరుగంటల వరకు రిజర్వు చేయబడింది.
* తుదిగా సాయంత్రం 6.30గంటలకు శ్రీ పద్మావతీ అతిథిగృహం నుంచి బయల్దేరి రేణిగుంట చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు. జిల్లా పాలనాధికారి సిద్ధార్థ్‌జైన్ సారథ¿్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
No comments:
Post a Comment