Thursday, 22 December 2016

Payment Through Finger Prints By AP CM

AP CM చంద్రబాబు మార్క్ వేలిముద్ర పేమెంట్



హైటెక్ ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభజన నేపథ్యంలో తెలుగు ప్రజలకు గుండెకాయ లాంటి హైదరాబాద్ లేని ఏపీకి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవైపు రాజధాని లేని కొరత.. మరోవైపు నిధుల కటకట.. అంతంతమాత్రంగా ఉండే ఆదాయం ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటానికి మించిన పెద్ద సమస్య మరొకటి ఉండదు. ఇలాంటి వేళ.. పాజిటివ్ అటిట్యూడ్ తో ముందుకెళుతున్న బాబుపై ఒక విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది.

గతంతో ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు బాబులో ఉన్న చురుకు ఇప్పుడులేదన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇదంతా బాబులో వచ్చిన మార్పు అనే కంటే కూడా.. చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణంగా చెప్పాలి. సీఎం చంద్రబాబులో చురుకుదనం ఎంతమాత్రం తగ్గలేదని.. అవకాశం రావాలే కానీ ఆయన ఎంతగా అల్లుకుపోతారన్నది తాజాగా ఉదంతాన్ని చెప్పాల్సిందే.

పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్న తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు.. నగదు రహిత చెల్లింపులపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్న వేళ.. నగదు రహిత లావాదేవీల్ని ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా చేసేందుకు వీలుగా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారి కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా జరుపుతున్న ఈ ప్రయోగం సక్సెస్ అవుతూ.. కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది.

నగదురహిత లావాదేవీలకు అవసరమైన యంత్రాల కోసం భారీగా ఖర్చు చేయకుండా రూ.వెయ్యి.. రూ.2వేల వ్యయంతో నగదు రహిత లావాదేవీల్ని జరిపేందుకు వీలుగా రూపొందించిన ఈ విధానం ఆసక్తికరంగా ఉండటమే కాదు.. దీన్ని మరింత లోతుగా పరిశీలించి.. పరీక్షిస్తే.. దేశ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసిన పక్షంలో నగదు రహిత లావాదేవీల్ని తేలిగ్గా అమలు చేయటమే కాదు.. ఈ విధానం పట్ల ప్రజలు సైతం సానుకూలంగా స్పందించే వీలుందని చెబుతున్నారు.

ఇంతకీ.. ఆ విధానం ఏమిటి? అదెలా పని చేస్తుందన్న విషయాన్ని చూస్తే.. తాను తెర మీదకు తీసుకొచ్చిన ఈ సరికొత్త టెక్నాలజీని గడిచిన రెండు రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన  ప్రత్యేక స్టాళ్లలో ఈ కొత్త విధానాన్ని అమలు చేయటం గమనార్హం. నగదు రహిత చెల్లింపులంటే అయితే పేటీఎం తరహా చెల్లింపులు.. లేదంటే ఈపాస్ యంత్రాలు.. కాదంటే.. స్వైపింగ్ మెషిన్లు అవసరమవుతాయి.

కానీ.. తాజాగా రూపొందించిన విధానంలో స్మార్ట్ ఫోన్ తో కానీ.. వేలిముద్రను గుర్తించే చిన్న యంత్రాన్ని (ఇది మార్కెట్లో రూ.వెయ్యి నుంచి రూ2వేలు మాత్రమే ఖర్చు అవుతుంది) ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా వినియోగదారులు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేసి జేబులో పది రూపాయిలు లేకున్నా ఫర్లేదు. వేలిముద్ర యంత్రంలో వేలి ముద్రను వేయటం ద్వారా రూ.10 మన ఖాతాలో నుంచి వ్యాపారి ఖాతాలోకి సులువుగా బదిలీ చేయటమే తాజా ప్రక్రియ ప్రత్యేకత. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు చొరవతో తెర మీదకు వచ్చిన ఈ విధానం పని చేయాలంటే కీలకమైన అంశం మాత్రం తప్పనిసరి.

అదేమంటే.. బ్యాంకు ఖాతాను అధార్ తో అనుసంధానం చేసి ఉండాలి. అదే జరిగితే.. వేలి ముద్రను స్కాన్ చేయటం ద్వారా.. సదరు వేలిముద్రను ఆధార్ తో లింక్ అప్ చేసి జత చేస్తారు. ఈ రెండు మ్యాచ్ అయిన వెంటనే.. సదరు వ్యక్తి బ్యాంకు ఖాతా ఓపెన్ అవుతుంది.అందులో ఎంత మొత్తాన్ని కట్ చేసుకోవాలో అంత మొత్తం కట్ చేసుకోవటంతో లావాదేవీ పూర్తి అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో రెండు అంశాలు కీలకమైనవి. ఒకటి.. వ్యాపారస్తుడి వద్ద వేలిముద్రను గుర్తించే యంత్రం లేదంటే స్కానర్ అవసరం. రెండోది.. ఖాతాదారుడు తమ బ్యాంకు ఖాతాను ఆధార్ తో అనుసంధానం చేసి ఉండాలి. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజా విధానాన్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా.. ఏపీ ముఖ్యమంత్రి ఎంత హైటెక్ అన్న విషయం మరోసారి లోకానికి తెలియజేసేలా బాబు చేశారన్న మాట వినిపిస్తోంది.

Wednesday, 21 December 2016

AP lo Neeti Projects

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వరుస జలసంబరాలు జరగనున్నాయి. 


డిసెంబర్‌ 26న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తొలివిడత కేంద్ర సాయం రూ.1,981 కోట్లు రాష్ట్రానికి అందనుంది. అది మొదలు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరుగనున్నాయి. డిసెంబర్‌ 29న గోదావరి ఎడమ వైపున పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పిఠాపురం వద్ద ఇందుకు సంబంధించిన సభ జరుగుతుంది. ఆ మర్నాడే పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే కాంక్రీటు పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రులు హాజరవుతారు. ఇక జనవరి 2న రాయలసీమ పట్టిసీమగా భావిస్తోన్న ముచ్చుమర్తి ఎత్తిపోతల పథకాన్ని సీఎం జాతికి అంకితం చేయనున్నారు. దీనివల్ల రాయలసీమకు 365 రోజులు తాగునీళ్ళు అందుతాయి.
జలాలను సమర్థంగా తగినంతగా వినియోగించుకున్నందుకు ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖకు సెంట్రల్‌ బోర్డు ఆప్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ (సీబీఐపీ)-2017 అవార్డు దక్కింది. కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి చేతులు మీదుగా డిసెంబర్‌ 29న ఈ అవార్డును దిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ అవార్డును బహూకరించనున్నారు.

Tuesday, 20 December 2016

Serf Udyogulaku vethanam pempu

సెర్ఫ్‌  ఉద్యోగులకు వేతనం పెంపు 
సెర్ఫ్‌ (గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ)లో పనిచేసే ఉద్యోగులకు 35 శాతం మేర వేతనాలను పెంచేందుకు మంత్రివర్గం ఆమోదించింది. 


దీని వల్ల 5038 మంది ప్రయోజనం పొందుతారు. అదనంగా మరో పది శాతం వేతనాన్ని ప్రతిభ ఆధారంగా పెంచుతారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.8.79 కోట్ల భారం పడనుంది. 15ఏళ్లకు మించి పనిచేస్తూ రూ.12వేల కంటే తక్కువగా ఉన్న ఉద్యోగులకు నెలకు రూ.15వేల వరకు రానుంది.

Sunday, 18 December 2016

AP lo 108 Service ki 202 kottha Vahanaalu

ఆంధ్రప్రదేశ్‌లో 108 సర్వీసు’కు 202 నూతన వాహనాలు

 

ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్య సేవలు అందించే ‘108 సర్వీసు’కు 202 నూతన వాహనాలు సమకూరాయి. ఇప్పటికే విజయవాడ చేరుకున్న వీటిని జిల్లాల వారీగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చేపట్టారు. తాజా అంబులెన్సులతో కలిపి మొత్తం వాహనాల సంఖ్య 468కు చేరింది. గతంతో పోలిస్తే ఈ వాహనాల్లో అత్యవసర వైద్య సేవల సదుపాయాలనూ మెరుగుపరిచారు. దీనిలోభాగంగా ప్రతి వాహనంలో మూడు ఆక్సిజన్‌ సిలిండర్లతో పాటు రూ.3 లక్షల విలువైన ఇతర వైద్యపరికరాలను అందుబాటులో ఉంచారు. మరో 76 అధునాతన వాహనాలు నెల రోజుల్లోగా రాష్ట్రానికి చేరుకోనున్నాయి.

Wednesday, 14 December 2016

Technical Certificate Course Notification


చిత్తూరు(విద్య), న్యూస్‌టుడే: టెక్నికల్‌ సర్టిఫికేట్‌ కోర్సు(లోయర్‌, హైయర్‌ గ్రేడ్‌) పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. డ్రాయింగ్‌, హ్యాండ్‌లూమ్‌, వీవింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ కోర్సుల్లో ఈ పరీక్ష ఫిబ్రవరిలో జరుగనుందని చెప్పారు.


ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పరీక్షలు రాయడానికి అర్హులన్నారు. దరఖాస్తులను వెబ్‌సైటు ద్వారా ఆన్‌లైన్‌లో పూరించి పంపాలని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని వాటిని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. లోయర్‌గ్రేడ్‌లో డ్రాయింగ్‌ పరీక్షకు రుసుం రూ.100, హ్యాండ్‌లూమ్‌, వీవింగ్‌ రూ.150, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీకి రూ.150లు, హైయర్‌ గ్రేడ్‌లో డ్రాయింగ్‌ పరీక్షకు రుసుం రూ.150, హ్యాండ్‌ల్యూమ్‌, వీవింగ్‌ టైలరింగ్‌, ఎంబ్రాయిడరీకి రూ.200లను ఈ నెల 23లోగా చెల్లించాలని తెలిపారు. రూ.50ల అపరాధ రుసుంతో ఈ నెల 30వరకు, రూ.75ల అపరాద రుసుంతో జనవరి 6వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పరీక్ష రుసుంను డిమాండ్‌ డ్రాప్టు (డీడీ)ల రూపంలో స్వీకరించమని, ఛలాను రూపంలోనే జమచేయాలని ఆయన కోరారు.టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు(విద్య), న్యూస్‌టుడే: టెక్నికల్‌ సర్టిఫికేట్‌ కోర్సు(లోయర్‌, హైయర్‌ గ్రేడ్‌) పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. డ్రాయింగ్‌, హ్యాండ్‌లూమ్‌, వీవింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ కోర్సుల్లో ఈ పరీక్ష ఫిబ్రవరిలో జరుగనుందని చెప్పారు. ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పరీక్షలు రాయడానికి అర్హులన్నారు. దరఖాస్తులను వెబ్‌సైటు ద్వారా ఆన్‌లైన్‌లో పూరించి పంపాలని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని వాటిని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. లోయర్‌గ్రేడ్‌లో డ్రాయింగ్‌ పరీక్షకు రుసుం రూ.100, హ్యాండ్‌లూమ్‌, వీవింగ్‌ రూ.150, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీకి రూ.150లు, హైయర్‌ గ్రేడ్‌లో డ్రాయింగ్‌ పరీక్షకు రుసుం రూ.150, హ్యాండ్‌ల్యూమ్‌, వీవింగ్‌ టైలరింగ్‌, ఎంబ్రాయిడరీకి రూ.200లను ఈ నెల 23లోగా చెల్లించాలని తెలిపారు. రూ.50ల అపరాధ రుసుంతో ఈ నెల 30వరకు, రూ.75ల అపరాద రుసుంతో జనవరి 6వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పరీక్ష రుసుంను డిమాండ్‌ డ్రాప్టు (డీడీ)ల రూపంలో స్వీకరించమని, ఛలాను రూపంలోనే జమచేయాలని ఆయన కోరారు.
Source  : Eanadu

Tuesday, 13 December 2016

16na Tirupati ki CM Chandrababu

16న తిరుపతికి చంద్రబాబు 
బర్డ్‌, స్విమ్స్‌లో ప్రారంభోత్సవాలు 
ఇస్కాపై అత్యున్నతస్థాయి సమీక్ష 
ఈనాడు-తిరుపతి
 
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 16వ తేదీ తిరుపతిలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన మంగళవారం రాత్రి ఖరారైంది. ఒక్కరోజులో దాదాపు ఎనిమిది గంటలపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహంచడంతోబాటు.. తిరుపతిలో వివిధ ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
* పర్యటన తేదీ: ఈ నెల 16 శుక్రవారం
* సమయం: ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 6.45గంటల వరకు
* తొలి కార్యక్రమం: రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా బర్డ్‌ ఆసుపత్రికి విచ్చేస్తారు. అక్కడ 11.15గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు ఉంటారు. ఇక్కడ రోగుల కోసం రూ.42.3కోట్లతో నూతనంగా అత్యాధునిక పరికరాలు.. సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఓపీడీ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రోగులతో మాట్లాడతారు. తుదిగా బర్డ్‌ ఆసుపత్రిని సందర్శిస్తారు.
* రెండో కార్యక్రమం: శ్రీ వేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ(స్విమ్స్‌). మధ్యాహ్నం 12.45గంటల నుంచి 1.45 గంటల వరకు. శ్రీ పద్మావతీ మహిళా వైద్యకళాశాల నూతన భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం నూతన ఆసుపత్రిని పరిశీలిస్తారు. ఆపై సమయాన్ని బట్టి వైద్యాధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.55నుంచి మూడుగంటల వరకు: తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుంటారు.
* మూడో కార్యక్రమం: మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీపద్మావతీ అతిథిగృహంలోని సమావేశ మందిరంలో 104వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ పనుల పురోగతిపై అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు.
* నాలుగో కార్యక్రమం: సాయంత్రం అయిదుగంటల నుంచి ఆరుగంటల వరకు రిజర్వు చేయబడింది.
* తుదిగా సాయంత్రం 6.30గంటలకు శ్రీ పద్మావతీ అతిథిగృహం నుంచి బయల్దేరి రేణిగుంట చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు. జిల్లా పాలనాధికారి సిద్ధార్థ్‌జైన్‌ సారథ¿్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

50 lakh members enrolled as members of Telugu Desam in AP

50 lakh members in 38 days. 



A record 50 lakh members enrolled as members of Telugu Desam in AP. General Secretary Nara Lokesh and senior party leaders cut a cake at the TDP AP State Office in Guntur yesterday to celebrate the milestone.










Thank you all.