Friday, 25 November 2016

Digital Transactions in AP

డిసెంబర్‌ ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలో 70శాతం పైగా డిజిటల్‌ లావాదేవీలు
 
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నగదు వివరాలు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 
డిసెంబర్‌ ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలో 70శాతం పైగా డిజిటల్‌ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం విద్యార్థులు, ఉపాధి హామీ పర్యవేక్షకులు, డ్వాక్రా సంఘాల్లోని డిజిటల్‌ అక్షరాస్యులను అన్ని గ్రామాలకు పంపి డిజిటల్‌ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఉద్యోగులంతా ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపాలని కోరారు.

రాష్ట్రంలో పంటలు చేతికొచ్చే సమయమని, రైతులకు లబ్ది చేకూర్చేలా డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో విస్తృతంగా ఈ-పాస్‌ యంత్రాలు వినియోగించడంపై అధికారులు విస్తృతమైన చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో ‘ఈ-పాస్‌’ యంత్రాలను ఏర్పాటు చేస్తే వాటిపైన 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ-పాస్‌ యంత్రాలు కొనుగోలు చేయడానికి వాయిదాలు కూడా ఇస్తున్నామని, కలెక్టర్లు దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వపరంగా కొత్తవాటిని కొనుగోలు చేసుకునేందుకు అయ్యే ఖర్చులో వెసులుబాటు కల్పిస్తామని సీఎం తెలిపారు.

No comments:

Post a Comment