ప్రఖ్యాత సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాల మురళీకృష్ణ (86) చెన్నై లోని తమ స్వగృహంలో కన్నుమూసారనే వార్త దిగ్భ్రాంతిని కలిగించింది..వారికి అశ్రునివాళి.
బాలమురళీకృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా
బాలమురళీ కృష్ణ ఆరేళ్ల వయసులో గాయకుడిగా సంగీత ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభంలో బాలమురళీ కృష్ణ తండ్రి పట్టాభిరామయ్య వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా 25 వేల కచేరీలు నిర్వహించారు. వయోలిన్, వీణ, మృదంగం తదితర సంగీత వాయిద్యాల్లో కృష్ణకు ప్రావీణ్యం ఉంది.
జుగల్బందీ తరహా కచేరీ రూపకల్పనకు ఆద్యులు. ఆయన టీటీడీ, శృంగేరి పీఠాల ఆస్థాన విద్వాంసులు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్ దేశాల్లో వేలాది కచేరీలు నిర్వహించారు. తెలుగు, కన్నడం, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో పాటలు పాడారు.
ఆయన భక్తప్రహ్లాదలో నారదునిగా నటించి తన పాటను తానే పాడారు. గంధర్వగాన సామ్రాట్, జ్ఞానసాగర, సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణం, గానగంధర్వ, గాయక శిఖామణి, జ్ఞానశిఖామణి, జ్ఞాన చక్రవర్తి, జ్ఞానపద్మం, నాదజ్యోతి, సంగీత కళాసరస్వతి, నాద మహర్షి వంటి బిరుదులు ఆయన సొంతం.
ఆయన ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరెట్లు అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లను అందుకున్నారు. మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతిమధ్యమావతి, గణపతి, సిద్దిరాగాలు, భద్రాద్రి శ్రీరామ చంద్రుని సుప్రభాతాన్ని ఆలపించారు.

No comments:
Post a Comment