Tuesday, 22 November 2016

బాలింతల కోసం ‘అన్న అమృత హస్తం’ పథకం

రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటును తగ్గించి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే సంకల్పంతో నిరుపేద గిరిజన, గ్రామీణ ప్రాంత గర్భిణీలు, బాలింతల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్న అమృత హస్తం’ పథకాన్ని అమలుచేస్తోంది
 గర్బిణీలు సంపూర్ణ ఆరోగ్యవంతులైన బిడ్డలకు జన్మనివ్వాలన్న ఉద్దేశంతో, ప్రసవం తర్వాత కూడా పౌష్టికాహార లోపంతో ఏ తల్లీ ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఆహారాన్ని అందిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది రూ.95 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా గర్బిణీలకు, బాలింతలకు 200 మిల్లీలీటర్ల చొప్పున పాలు, అన్నం, పప్పు, కూరలు అందిస్తారు. ఆకు కూరలను వారానికి మూడుసార్లు కచ్చితంగా అందిస్తారు. నిత్యం కోడిగుడ్డును అందజేస్తారు. అవసరమైన మేరకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లను ఇస్తున్నారు. తల్లి, గర్బిణీలు రోజు వారీ తీసుకునే ఆహారంలో 40 శాతం ఆహారం ఈ పథకం ద్వారా సమకూరుతుంది.
'అన్న అమృత హస్తం’ పథకం ద్వారా 2.59 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు లబ్ధి పొందుతున్నారు. ఇటీవల లెక్కల ప్రకారం ఈ పథకాన్ని వినియోగించుకుని 1,40,624 మంది గర్భిణీలు 5-8 కిలోల మేర బరువు పెరిగారు. మొత్తం 16,603 ప్రసవాలు జరగ్గా వాటిలో 12,111 ప్రసవాల్లో జన్మించిన శిశువులు రెండున్నర కిలోల కంటే ఎక్కువ బరువుతో జన్మించారని తెలిపింది.

No comments:

Post a Comment